Pentagon Retweetes Post Calling On Trump to Resign | Oneindia Telugu

2017-11-17 379

The Pentagon’s official Twitter account has retweeted then quickly deleted a post that included a call for President Donald Trump to resign.

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఓ పొరపాటు కారణంగా ఇది చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ట్వీట్ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేస్తున్నార్నట్లుగా ఉన్న ట్వీట్‌ను పెంటగాన్ పొరపాటుగా రీట్వీట్ చేసింది. గమనించిన అధికారులు దానిని వెంటనే డిలీట్ చేశారు.
అప్పటికే అది నెటిజన్లకు చేరి, వైరల్ అయింది. పెంటగాన్ గతంలోను ఇలా పొరపాటు చేసింది. అమెరికా రహస్యంగా ఆయుధాలు దాస్తోందని, బీ1 అణుబాంబులను గాలిలో వదలనుందని పెంటగాన్ ట్వీట్ చేసింది.
ఇదిలా వుంటే మరోవైపు..
అమెరికాకు.. చైనా షాకిచ్చింది. ఉత్తరకొరియా తమ మాట వినాలంటే.. ఆ ద్వీప సరిహద్దుల నుంచి అమెరికా దళాలను ఊపసంహరించాలంటూ తాజాగా అమెరికాకు ఓ కండీషన్ పెట్టింది. ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వరుస క్షిపణి పరీక్షలకు పాల్పడి ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేయడం, తన చిరకాల ప్రత్యర్థి అయిన అమెరికా భూభాగం తమ టార్గెట్ లోకి వచ్చిందంటూ సంచలన ప్రకటన చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాను అదుపులోకి తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు తనదైన శైలిలో వాగ్భాణాలు విసురుతూనే.. మరోవైపు ఐక్యరాజ్య సమితిచే ఆ దేశంపై ఆంక్షలు కూడా విధింపజేశారు.